సత్తా చాటిన ఖాదీ పరిశ్రమ.. 1.87 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు

సత్తా చాటిన ఖాదీ పరిశ్రమ.. 1.87 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు

హైదరాబాద్​, వెలుగు: ఖాదీ, గ్రామ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.1,87,105 కోట్లకు చేరాయి. ఈ వివరాలను ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ మనోజ్ కుమార్ మంగళవారం వెల్లడించారు.  2025లో ఈ అమ్మకాలు రూ.1,70,551.37 కోట్లుగా నమోదయ్యాయి. 

అంతకుముందు ఆర్థిక సంవత్సర సేల్స్​ విలువ రూ.31,154 కోట్లు మాత్రమే. రాబోయే ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల విలువ రూ.2.51 లక్షల కోట్లు దాటుతుందని కేవీఐసీ చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు.  

ఖాదీ గ్రామ పరిశ్రమల ఉత్పత్తుల తయారీ కూడా భారీగా పెరిగింది. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ.26,109 కోట్లుగా ఉన్న ఉత్పత్తి, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 380 శాతం వృద్ధితో రూ.1,25,296 కోట్లకు చేరిందని కుమార్ వివరించారు.