9999 నంబర్ @ రూ.21 లక్షలు

9999 నంబర్ @ రూ.21 లక్షలు
  •     ఖైరతాబాద్ ఆర్టీఏ ఫ్యాన్సీ నంబర్ల వేలం
  •     ఒక్క రోజే రూ. 53 లక్షల ఆదాయం 

హైదరాబాద్ ,వెలుగు :  ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఖైరతాబాద్ ఆర్టీఏ (సెంట్రల్ జోన్)కు ఫుల్ ఇన్ కమ్ వచ్చింది. 8 ఫ్యాన్సీ నంబర్ల ద్వారా మంగళవారం ఒక్కరోజే  రూ. 53,34,894  సమకూరింది. టీఎస్ 09 జీసీ 9999 నంబర్​ను ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ రూ. 21 లక్షల 60 వేలకు దక్కించుకున్నట్లు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ( జేటీసీ ) పాండురంగ నాయక్  ఓ ప్రకటనలో తెలిపారు.