Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారీ రిలీఫ్ లభించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అత్యంత ఈజీ క్యాచ్‌ను నేలపాలు చేయడంతో కోహ్లీ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో బౌలర్ ఖలీల్ అహ్మద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో స్టేడియంలోని ఆర్సీబీ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని విరాట్ కోహ్లీ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఖలీల్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో కోహ్లీని కట్టడి చేయడంతో, బంతి బ్యాట్ సరిగ్గా తగలకుండా గాలిలోకి లేచింది. బాల్ నేరుగా ఫీల్డర్ శివమ్ దూబే చేతుల్లోకి వెళ్ళింది. స్టేడియంలోని వేలమంది ప్రేక్షకులు నిశ్శబ్దంగా చూస్తుండగా, దూబే ఆ క్యాచ్ ని వదిలేశాడు. ఖచ్చితంగా వికెట్ వస్తుందని ఆశించిన ఖలీల్, దూబే క్యాచ్ డ్యాప్ చేయగానే మైదానంలోనే మోకాళ్లపై కూర్చుండిపోయాడు. ఈ క్యాచ్ వదిలి పెట్టడంతో కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగులు చేసిన తర్వాత అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ లో మళ్లీ శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకున్నాడు.
►ALSO READ | PSL 2026: వరల్డ్ నెంబర్–1గా పాకిస్తాన్ సూపర్ లీగ్.. పీసీబీ చైర్మన్ సెల్ఫ్ డబ్బా
కాగా ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగిపోయి బ్యాటింగ్ చేస్తున్నారు. కేవలం 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేశారు. క్రీజులో ఫిల్ సాల్ట్ (26), దేవదత్ పడిక్కల్ (3) ఉన్నారు. చెన్నై బౌలర్లలో కాంబోజ్ ఒక్కేడే వికెట్ తీసుకున్నాడు.
Bro , really Shivam dube ? #RCBMatch #RCBVsCSK pic.twitter.com/Q41TCuPFW1
— Oo_Womaniya💙🤍 (@KDramaWomaniyaa) April 5, 2026
