బింద్రన్​ వాలే​లా కనిపించేందుకు .. జార్జియాలో అమృత్​కు కంటి ఆపరేషన్

బింద్రన్​ వాలే​లా కనిపించేందుకు .. జార్జియాలో అమృత్​కు కంటి ఆపరేషన్
  • సర్జరీ కోసం 2 నెలలు అక్కడే మకాం
  • 1984లో హతమైన ఖలిస్తానీ టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్
  • అతనిలాగా కనిపించేందుకు డ్రెస్సింగ్, తలపాగా..

న్యూఢిల్లీ : ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ఇంకా పంజాబ్ పోలీసులకు చిక్కలేదు. అతడి ఆచూకీకోసం పాక్, నేపాల్ బార్డర్​తో పాటు పంజాబ్ వ్యాప్తంగా వెతుకుతూనే ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి, దిబ్రూగడ్ జైలులో ఉన్న అతడి అనుచరులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. ఇండియాకు వచ్చే ముందు జార్జియాలో అమృత్​పాల్ కంటి ఆపరేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఖలిస్తానీ టెర్రరిస్ట్​ జర్నైల్ సింగ్ బ్రిందన్ వాలేలా కనిపించేలా అమృత్​పాల్ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. సర్జరీ కోసం 2022, జూన్ 20 నుంచి  ఆగస్టు 19 దాకా జార్జియాలోనే ఉన్నాడు. 

ఆపరేషన్​ బ్లూస్టార్​లో జర్నైల్ సింగ్ హతం

‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్.. తనను తాను బింద్రన్ వాలే-2గా ఫోకస్ చేసుకునేందుకు ప్రయత్నించే వాడు. అందుకు అనుగుణంగానే ఆయన తన టర్బన్, డ్రెస్సింగ్, సిక్కు గుర్తులు బింద్రన్ వాలేను గుర్తుతెచ్చేలా చూసుకునేవాడు. జర్నయిల్ సింగ్ బింద్రన్ వాలే 1984 జూన్ 6న జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హతమయ్యాడు. దీంతో ఖలిస్తాన్​ ఉగ్రవాదులపై ఇండియన్​ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ విజయవంతమైంది. 

గతేడాది వారిస్ పంజాబ్​ దే బాధ్యతలు..

2022 సెప్టెంబర్ 29న మోగా జిల్లాలోని బింద్రన్​వాలే సొంతూరైన రోడె గ్రామంలో జరిగిన ఒక ప్రోగ్రాంలో అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆయన మద్దతుదారులు ప్రకటించారు. ఆనందపూర్ సాహిబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన అమృత్ సెర్మనీ (ఖల్సా సంప్రదాయంలోని దీక్ష)కి బింద్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాలే తరహాలో డ్రెస్సింగ్​లో అటెండ్​ అయ్యాడు. యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మద్దతు కూడగట్టేందుకు రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రారంభించాడు.

పోలీసుల సెలవులన్నీ రద్దు

మార్చి 18 నుంచి అమృత్​పాల్ పరారీలో ఉన్నాడు. సోషల్ మీడియాలో 2 వీడియోలు, ఒక ఆడియో క్లిప్ రిలీజ్​ చేశాడు. పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. వైశాఖి సందర్భంగా 14వ తేదీన సిక్కుల సర్బత్ ఖల్సా సమావేశానికి అమృత్ పాల్​ పిలుపునివ్వడంతో పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైఅలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. అమృత్​పాల్ లొంగిపోయే అవకాశం ఉండటంతో 14వ తేదీ దాకా ఇప్పటికే ఇచ్చిన సెలవులను రద్దు చేయడంతో పాటు కొత్తగా సెలవులు మంజూరు చేయొద్దని డీజీపీ ఆదేశించినట్లు సమాచారం.