పాకిస్థాన్ లో ఖలిస్తానీ ఉగ్రవాది మృతి.. రహస్యంగా దహన సంస్కారాలు

పాకిస్థాన్ లో ఖలిస్తానీ ఉగ్రవాది మృతి.. రహస్యంగా దహన సంస్కారాలు

పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఖలిస్థానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే డిసెంబర్ 2న మరణించాడు. పలు నివేదికల ప్రకారం.. అతను పాకిస్థాన్‌లో గుండెపోటుతో మరణించాడు. సిక్కు ఆచారాల ప్రకారం రోడేను పాకిస్థాన్‌లో రహస్యంగా దహనం చేశారు. పాకిస్థాన్‌లోని అతని సహచరులు అతని మరణ వార్తను దాచడానికి ప్రయత్నించారని పలు వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమంలో కీలక పాత్ర పాత్ర పోషించిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడే రోడే.

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు రోడే భారత్‌పై తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అతను పాకిస్తాన్ నుండి ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (KLF), ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ISYF) అనే నిషేధిత సంస్థలను నిర్వహిస్తున్నాడు.               

రోడే ఆస్తి జప్తు

ఈ ఏడాది అక్టోబర్‌లో పంజాబ్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోగాలోని కోతే గురుపరా గ్రామంలో దాడి చేసింది. ఈ క్రమంలోనే రోడేకు చెందిన ఆస్తులను జప్తు చేసి అక్కడ అధికారులు నోటీసు అతికించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 33 (5) కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీలో రోడ్‌పై కేసు నమోదైంది. అతని మొత్తం భూమిలో 1/4 వంతు సీలు వేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ బృందం అతని భూమిని సీల్ చేసి దానిపై ప్రభుత్వ బోర్డును పెట్టింది.