- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. ఆదివారం కాల్వోడ్డు, జూబ్లీక్లబ్, రజబ్అలీ పార్క్ ఏరియా, జూబ్లీపురా, మున్నేరు వరద ముంపు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. గతంలో ఎన్నడూలేని వరద ఈసారి జూబ్లీ క్లబ్ వరకు రావడానికి గల ప్రధాన సమస్యలను పరిష్కరించడం కోసం చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం మున్నేరు పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా పునరావాస కేంద్రాలకు రావాలన్నారు. రానున్న నాలుగైదు రోజులు వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కలెక్టర్ వెంట అస్టిసెంట్ ట్రైనీ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ ఉన్నారు.