తీగలవంతెన నిర్మాణ పనులు స్పీడప్ చేయాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర

తీగలవంతెన నిర్మాణ పనులు స్పీడప్ చేయాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర

ఖమ్మం టౌన్, వెలుగు : మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, కాల్వొడ్డు తీగల వంతెన పనులు, మున్నేరు భూ నిర్వసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లేఔట్ వెంచర్ పురోగతి పనులను తనిఖీ చేశారు. 

మున్నేరు నదిపై ఉన్న రాజీవ్ గృహకల్ప, రంగనాయక గుట్ట, ప్రకాశ్ నగర్ చెక్​డ్యాంలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టరేట్ లో అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీజతో కలిసి హౌజింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో 10 వేల ఇండ్ల గృహప్రవేశాలకు కార్యాచరణ చేసినట్లు తెలిపారు.