ఎన్యూమరేటర్లకు సహకరించాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర

ఎన్యూమరేటర్లకు సహకరించాలి :  ఖమ్మం కలెక్టర్ దివాకర

ఖమ్మం టౌన్/ కొణిజర్ల, వెలుగు : జనగణన హౌస్ లిస్టింగ్ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అయిందని, ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. వైరా నియోజకవర్గ పరిధిలోని కొణిజర్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు, వార్డ్ అధికారులు నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియపై వివరణ తీసుకొని పలు సూచనలు చేశారు.

అంతకుముందు ఆయన గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీలను స్వీకరించారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వంపై స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్లు పి.శ్రీజ, కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.