మహిళల ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలి : సీపీ సునీల్ దత్

మహిళల ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలి :  సీపీ సునీల్ దత్
  • ఖమ్మం సీపీ సునీల్​ దత్​ 

ఖమ్మం టౌన్, వెలుగు :  పోలీసు స్టేషన్ ను ఆశ్రయించే మహిళల ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు, చార్జిషిట్ రికార్డులు, సీడీ ఫైళ్లను పరిశీలించి  అధికారులకు పలు సూచనలు చేశారు. 

మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత కల్పించాలన్నారు. విధిగా కళాశాలలు, పాఠశాలలను, మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మహిళా పోలీసు సిబ్బంది సందర్శించి, వారికి రక్షణగా నిలిచే చట్టాలు పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు.