
మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్న ఇసుక ట్రాక్టర్ల యాజమానులకు ఖమ్మం జిల్లా చింతకాని ఎస్ఐ బోయిన ఉమా వార్నింగ్ ఇచ్చారు. మంత్రి చేత రికమండ్ చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎవరైనా సరే.. వాహనాలకు సరైన పత్రాలు మితిమీరిన వేగం, నిబంధనలు పాటించక పోయినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఇటువంటి వాహనాలకు మంత్రి ద్వారా ఫోన్ చేపిస్తే కుదరదన్నారు ఎస్ఐ ఉమా. ఖమ్మం జిల్లా చింతకాని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లకు యజమానులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ మధ్యకాలంలో ట్రాక్టర్లు మితిమీరిన వేగం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. యాక్సిడెంట్లు అవుతున్నాయన్నారు. ఇలా జరిగితే ఊరుకునే సమస్య లేదని ట్రాక్టర్ యజమానులుకు , డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చారు ఎస్సై.
see more news