
ఇంగ్లాండ్ లో నానా అవస్థలు పడుతున్న తమని కాపాడాలంటూ ఖమ్మం జిల్లాకు చెందిన 25మంది విద్యార్ధులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 250మంది విద్యార్ధులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను వేడుకుంటున్నారు. బీ టెక్ పూర్తిచేసిన తాము మాస్టర్స్ కోసం గతేడాది సెప్టెంబర్ లో ఇంగ్లాండ్ వచ్చినట్లు తెలిపారు. ఓ వైపు కాలేజీలకు వెళుతూ, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నామని, కరోనా తో కాలేజీలు మూతబడ్డాయని, పార్ట్ టైం ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాస్టాఫ్ లివింగ్ ఎక్కవ కావడంతో తినడానికి తిండి కూడా దొరకడం లేదంటూ ఓ వీడియోను విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఎయిరిండియా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవ్వడంతో ఇండియాకు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిపిన విద్యార్ధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నారు. ఇండియా కు వస్తే హోం క్వారంటైన్ లో ఉండేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.