రూ.8 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

రూ.8 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఖ‌మ్మం జిల్లా: నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్ల‌ను త‌ర‌లిస్తున్న నిందితుణ్ని ఖ‌మ్మం జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం నిఘా ఉంచి ప‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారి నుంచి ‌రూ.8 ల‌క్ష‌ల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తల్లాంపాడు గ్రామానికి చెందిన పుచకాయల సురేష్ అనే వ్య‌క్తి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో నిషేధిత గుట్కా, అంబార్ ప్యాకెట్లు విక్రయాలు జరిపేవాడు. అందుకోసం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి కొనుగోలు చేసి చట్టవిరుద్ధంగా జిల్లాకు అక్రమ రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఈ మేరకు పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాలతో అడిషనల్ డీసీపీ మురళీధర్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సిఐ వెంకట్ స్వామి, ఎస్ఐ ప్రసాద్ తమ సిబ్బందితో కూసుమంచి వద్ద తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వస్తున్న ఎపి 16 సిడి 0345 నెంబరు గల కారును అపి తనిఖీ చేయగా నిషేధిత పొగాకు ఉత్పత్తులు అంబర్, గోవా మరియు మిరాజ్ “19” సంచులను గుర్తించారు. వీటి విలువ రూ. 8,35,000 / -. వుంటుందని ఏసీపీ వెంకట తెలిపారు. సురేష్ ను అరెస్ట్ చేయ‌గా…కారు డ్రైవర్ యాలవల్లి సునీల్ పరారీలో ఉన్నాడు. అదుపులోకి తీసుకొన్న సురేష్‌పై చట్టపరమైన చర్యల నిమిత్తం కుసుమంచి పోలీసు స్టేషన్ అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. తనిఖీల్లో కానిస్టేబుల్ చెన్నారావు, కళింగారెడ్డి, హమీద్, రామారావు పాల్గొన్నారు.