ఖమ్మం జిల్లాలో హోటళ్లకు రూ.2.90 లక్షల ఫైన్

 ఖమ్మం జిల్లాలో హోటళ్లకు రూ.2.90 లక్షల ఫైన్

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లాలో ఆహార భద్రతా ప్రమాణాల అమలులో భాగంగా 11 కేసులను పరిష్కరించి,   రూ.2.90 లక్షల జరిమానా విధించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సి.హెచ్.లోకేశ్​ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. 

రమేశ్​దాబాకు రూ.లక్ష, హవేలీ రెస్టారెంట్‌‌‌‌కు రూ.75 వేలు, రిలయన్స్ రిటైల్‌‌‌‌కు రూ.50 వేలు, డిలైట్ మండీ, జాజూకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. ఆహార సంస్థలు పరిశుభ్రత, నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆఫీసర్లు సూచించారు.