
ఖమ్మం మార్కెట్‌కు సోమవారం 60 వేల కొత్త తేజ రకం మిర్చి బస్తాలు రావడంతో నిండిపోయింది. జెండా పాట రూ.23,500 పలికింది. వరుస సెలవులతో మార్కెట్‌ను మిర్చి ముంచెత్తింది. వ్యాపారులు.. ఆయిల్ రకం అంటూ, ఇతర కారణాలను సాకుగా చూపుతూ రూ.20 వేలకు మించి ధర ఇవ్వకపోవడంతో నిండా మునిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం