
- పాత పినపాక గ్రామంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
తల్లాడ, వెలుగు: బీఆర్ఎస్ పాలన పూర్తిగా కమీషన్లతో నడిచిందని ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో ప్రజాప్రభుత్వ పాలన కొనసాగుతోందని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఆదివారం తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం వేల కోట్లతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కోరారు. తర్వాత నారాయణపురం, మల్లారం గ్రామాల్లో పెళ్లిళ్లకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇటీవల గ్యాస్ ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందగా గుత్తికొండ వినోద్ కుమార్ కుటుంబాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాపా సుధాకర్, నాయకులు గుర్రం శ్రీనివాసరావు, దిరిశాల నరసింహారావు, తూము వీరభద్రరావు, గోవిందు శ్రీనివాసరావు, యూత్ నాయకులు అడపా అనిల్, వారాల అజయ్, కటికి కిరణ్, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.