సకాలంలో ఇంటిపన్ను చెల్లించాలి : చిన్నం సత్యం

సకాలంలో ఇంటిపన్ను చెల్లించాలి : చిన్నం సత్యం

ఖానాపూర్, వెలుగు: ప్రతి ఒక్కరూ సకాలంలో ఇంటి, వ్యాపార  పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం కోరారు. శుక్రవారం ఖానాపూర్ లో ఇంటింటికి తిరుగుతూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇంటి పన్నులు వసూలు చేశారు.  ఈ సందర్భంగా  చైర్మన్ మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధి విషయంలో అందరి సహకారం తప్పనిసరన్నారు. అలాగే పట్టణ శివారులోని డంపింగ్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పరికరాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.