కాంగ్రెస్​లోకి ఖానాపూర్ పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు

కాంగ్రెస్​లోకి  ఖానాపూర్ పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు

ఖానాపూర్, వెలుగు: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఖానాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏడుగురు డైరెక్టర్లు గంగన్న, చిన్న రాజన్న, భీమన్న, నరేందర్, వసంతరావు, గణేశ్​, విలాస్​తో కలిసి బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొనికెని దయానంద్, నిమ్మల రమేశ్, కౌన్సిలర్లు షబ్బీర్ భాషా, శంకర్, మాజీ వైస్ ఎంపీపీ తోట సత్యం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సచిన్, నాయకులు జహీర్ హైమద్, రాజేందర్ గౌడ్,  సత్య నారయణ, గంగ నర్సయ్య పాల్గొన్నారు.

ALSO READ : కాగజ్ నగర్ మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికుల ధర్నా

పొనకల్​ మాజీ పీఏసీఎస్ చైర్మన్ సైతం

జన్నారం: జన్నారం మండలంలోని పొనకల్ పీఎసీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్త రాజమౌళి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. అత్రం సుగుణ విజయం కోసం కృషి చేస్తానని రాజమౌళి తెలిపారు.