మన ఫారిన్ పాలసీ పతనం ట్రంప్ టారిఫ్లే నిదర్శనం: ఖర్గే

మన ఫారిన్ పాలసీ పతనం ట్రంప్ టారిఫ్లే నిదర్శనం: ఖర్గే

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సర్కార్​ తీరు వల్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఇండియాపై 50 శాతం టారిఫ్​లకు తెగబడ్డారని, ఇది అన్ని రంగాలపై ప్రభావం చూపుతుందని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు.

 ‘‘మోదీ అనుసరిస్తున్న ఫారిన్​ పాలసీ ఎట్లున్నదో ట్రంప్​ టారిఫ్​లను చూస్తే అర్థమవుతుంది. దౌత్య విధానాన్ని మోదీ సర్కార్​ పతనం చేసింది. ఈ టారిఫ్​లను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నది” అని ఆయన గురువారం ఎక్స్​లో ట్వీట్​ చేశారు. ట్రంప్​ విధించిన 50 శాతం టారిఫ్​ల వల్ల ఇండియన్​ ఎకానమీపై దాదాపుగా రూ.3.75 లక్షల కోట్ల భారం పడుతుందని..  చిన్న పరిశ్రమలు, వ్యవసాయం, డెయిరీ, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫార్మా తదితర  రంగాలు దెబ్బతింటాయన్నారు. మోదీ విధానాల వల్లే ట్రంప్​ ఇలా టారిఫ్​లు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ట్రంప్​ టారిఫ్​లపై మోదీ సర్కార్​ ఏం చేస్తుందో చెప్పాలని ఖర్గే డిమాండ్​ చేశారు.