-
ఖేలో ఇండియా విమెన్స్ లీగ్‌లో ఐదు పతకాలు సొంతం
హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన మ్యాక్స్‌వెల్ ట్రేవర్ సైక్లింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎంటీసీడబ్ల్యూఏ)కు చెందిన రైడర్లు అస్మిత ఖేలో ఇండియా విమెన్స్ లీగ్‌లో సత్తా చాటారు. కేరళలోని త్రివేండ్రలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ తరఫున పోటీ పడిన ఎస్. రత్నికా, శివ బింద్య స్వర్ణం సహా ఐదు పతకాలు సాధించారు. ఎస్. రత్నికా నాలుగు పతకాలు గెలిచింది. ఇందులో రెండు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. శివ బింద్య 2 కి.మీ ఇండివిడ్యువల్ పర్స్యూట్‌లో 3 నిమిషాల్లో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సొంతం చేసుకుంది. రత్నికా, శివబింద్యను ఎంటీసీడబ్ల్యూఏ సెక్రటరీ, అడ్వొకేట్ ఎంకే పాషా, ఎంటీసీడబ్ల్యూఏ ప్రెసిఎడంట్ డాక్టర్ మ్యాక్స్‌వెల్ ట్రేవర్ అభినందించారు.