కియా ఇండియా కొత్త వెర్షన్.. కారెన్స్ ఎక్స్లైన్

కియా ఇండియా కొత్త వెర్షన్.. కారెన్స్ ఎక్స్లైన్

కియా ఇండియా కారెన్స్  ఎక్స్​ లైన్ వెర్షన్‌‌ను పరిచయం చేసింది. ఇది పెట్రోల్,  డీజిల్ వేరియంట్లలో వస్తుంది. పెట్రోల్​ వెర్షన్​ ధర రూ.18,94,900 కాగా, డీజిల్​ వెర్షన్​ ధర  19,44,900.  ఎక్స్​లైన్​లోని1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డీసీటీతో వస్తుంది. 

అయితే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్​లో 6-స్పీడ్ ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్​ ఉంటుంది. కారులోని ఇన్ఫోటైన్‌‌మెంట్ స్క్రీన్‌‌ను మొబైల్​ఫోన్​ ద్వారా కంట్రోల్​ చేయవచ్చు.  ఎనిమిది -స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు,  10.25-అంగుళాల స్క్రీన్​ వంటి ఫీచర్లు ఉంటాయి.