
రామ్ చరణ్‌కు జంటగా ‘గేమ్ చేంజర్’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న కియారా అద్వాని.. తాజాగా మరో సౌత్ స్టార్‌కి జంటగా నటించబోతోంది. తమిళ హీరో ధనుష్ సినిమాలో ఆమె హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే ఇది సౌత్ సినిమా మాత్రం కాదు. వివరాల్లోకి వెళితే.. ధనుష్ హీరోగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘తేరే ఇష్క్ మే’ పేరుతో రూపొందే ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానిని ఎంపిక చేయబోతున్నారట. ఇటీవలే కథ చెప్పగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ధనుష్ హీరోగా ఆనంద్ తీసిన ‘రాంఝానా’ విడుదలై పదేళ్లవుతోంది. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘అత్రంగి రే’ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో సినిమాగా దీన్ని అనౌన్స్ చేశారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.
ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో ఉత్తర ప్రదేశ్‌లో షూటింగ్ మొదలవనుంది. వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందబోయే ‘వార్ 2’లోనూ హీరోయిన్‌గా కియారా అద్వాని పేరు వినిపిస్తోంది.