
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్(Kichcha Sudeep) మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రానున్నారు. ‘కిచ్చా 46’( Kichcha46) అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో సుదీప్ చాలా వైల్డ్ గా కనిపిస్తున్నారు.
ఈ టీజర్‌లో 'యుద్ధాన్ని ఆరంభించే వాడు నాకు నచ్చడు.. యుద్ధానికి భయపడి పారిపోయేవాడు నాకు నచ్చడు. రంగంలో దిగి శత్రువుని వెంటాడి, వేటాడి.. వాళ్లు రక్తంతో పరిగెత్తి పారిపోయేదాన్ని చూసేవాడు నేను.. దిగితే దయ, క్షమ, లాంటిది ఏదీ ఉండదు..ఐ యామ్ నాట్ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్..' అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అజనీష్ లోకనాథ్ (Anjaneesh Loknath) ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
కిచ్చా 46 గా వస్తున్న ఈ మూవీకు టైటిల్, రిలీజ్ డేట్ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ మూవీతో విజయ్ కార్తికేయ(Vijaykartikeyaa) అను కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. కాగా ఈ మూవీని కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను(Kalaippuli S Thanu) ప్రొడ్యూస్ చేస్తున్నాడు.