కన్నడ స్టార్ సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మార్క్’(MARK). సుదీప్ కెరీర్‌లో ఇది 47వ చిత్రం. మ్యాడ్, ఆటిట్యూడ్, రూత్ లెస్, కింగ్.. అంటూ మార్క్ పేరులోని ఇంగ్లీష్ అక్షరాలకు డెఫినిషన్ ఇచ్చారు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న ‘మార్క్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇవాళ (డిసెంబర్7న) మార్క్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మార్క్ ట్రైలర్ ఆసక్తిగా సాగింది. సుదీప్ పోషిస్తున్న అజయ్ మార్కండేయ పాత్ర పేరును సూచించేలా ‘మార్క్’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సిటీలో ఉన్నట్టుండి 18కి పైగా పిల్లలు మిస్ అవ్వడం, పవర్‌ఫుల్ పోలీసు అధికారి అయిన హీరో.. సస్పెండ్ అవ్వడం.. ఆ పిల్లల ఆచూకీ కోసం ప్రయత్నించడం వంటి సీన్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా సుదీప్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన ఈ ట్రైలర్కు అజనీష్ లోకనాథ్ అందించిన బీజీఎం గూస్ బంప్స్ ఇస్తోంది.
ఓవరాల్గా చెప్పాలంటే.. అనుకోకుండా చిన్నపిల్లలు మిస్ అయ్యి చనిపోతుండగా.. ఈ కేసును సుదీప్ ఎలా చేధించాడు అనేది ఈ సినిమా కథ అని టాక్. ఇందులో ముఖ్య పాత్రల్లో నటించిన నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో ఇంటెన్స్ సీన్స్ తో హీరో సుదీప్కు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. విక్రాంత్, నవీన్ చంద్ర, దీప్షిక, రోహిణీ ప్రకాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
