- కరోనాపై విజయం సాధించాలని ఆకాంక్ష
సియోల్: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల విజయానికి 75 వార్షికోత్సవం సందర్భంగా గ్రీటింగ్స్ చెప్తూ కిమ్ లేఖ రాశారు. కరోనా కట్టడిలోనూ రష్యా విజయం సాధించాలని కిమ్ ఆకాంక్షించినట్లు ఉత్తర కొరియా అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది. ‘‘యుద్ధంలో గొప్ప విజయాలను సాధించిన సంప్రదాయం కలిగిన రష్యా.. కరోనాను నియంత్రించడంలోనూ రష్యా అధ్యక్షుడు, ప్రజలు విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను” అని సందేశంలో కిమ్ పేర్కొన్నట్లు తెలిపింది. చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్‌ను మెచ్చుకుంటూ.. కిమ్ జోంగ్ శుక్రవారం మౌఖిక సందేశం పంపించిన సంగతి తెలిసిందే.
