బ్రిటన్ రాజ దంపతులపై గుడ్లతో దాడి

బ్రిటన్ రాజ దంపతులపై గుడ్లతో దాడి

ఉత్తర ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న బ్రిటన్ రాజు ఛార్లెస్-3 దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. వారిపై గుడ్లతో దాడి జరిగింది.  వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.  యార్క్ నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజు ఛార్లెస్, కెమిల్లా దంపతులు వచ్చిన  సందర్భంలో గుడ్ల దాడి జరిగింది. వారు జనానికి షేక్ హ్యాండ్ ఇస్తూ నడుస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.  

బానిసల రక్తంతో ఈ దేశాన్ని నిర్మించారంటూ గుడ్లు విసిరిన వ్యక్తి నినాదాలు చేశాడు. దాడి చేసిన వ్యక్తిని పాట్రిక్ థెల్ వెల్ అనే పర్యావరణ ఉద్యమ కార్యకర్తగా గుర్తించారు. అతడు గ్రీన్ పార్టీ  సభ్యుడిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. గతంలో 2001, 2005 సంవత్సరాల్లోనూ ఛార్లెస్ పై ఇలాగే దాడులు జరిగాయి.