కింగ్ చార్లెస్ 3 భావోద్వేగభరిత ప్రసంగం

కింగ్ చార్లెస్ 3 భావోద్వేగభరిత ప్రసంగం

బ్రిటన్ కు కొత్త రాజుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కింగ్ చార్లెస్ 3  దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈక్రమంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మా అమ్మ క్వీన్ ఎలిజెబెత్ 2 జీవిత మంతా ప్రజల కోసమే ఆలోచించారు’’ అని చెబుతూ ఎమోషన్ కు లోనయ్యారు. ‘‘నా జీవితానికి అమ్మే ప్రేరణ. అమ్మ మరణం మమ్మల్ని కలిచివేసింది. రాణి ఎలిజెబెత్ 2 లాగే నేను కూడా ప్రజల కోసం, తుది శ్వాస దాకా అంకిత భావంతో పనిచేస్తా’’ అని కింగ్ చార్లెస్ 3  దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.

‘‘పూర్తి నిబద్ధతతో జీవితాన్నంతటిని  బ్రిటన్ ప్రజల కోసం రాణి ఎలిజెబెత్ 2   అంకితం చేశారు. ఆమె బాటలోనే నేను కూడా నడుస్తా’’ అని తెలిపారు. ఈసందర్భంగా అమ్మ క్వీన్ ఎలిజెబెత్ 2కు కింగ్ చార్లెస్ 3 నివాళులు అర్పించారు.  ‘‘రాజుగా నాబాధ్యతను.. ఎంతో నిబద్ధతతో నిర్వర్తిస్తాను. ప్రజలకు జీవితకాలమంతా అంకిత భావంతో  పాటుపడతాను’’ అని చార్లెస్ అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో రాణిగారిపట్ల దేశ ప్రజలు చూపించిన ప్రేమకు.. తమకు అండగా ఉంటున్న బ్రిటన్ ప్రజలకు, కామన్వెల్త్ దేశాధినేతలకు.. ప్రపంచవ్యాప్తంగా సంతాపం తెలిపిన వారందరికి చార్లెస్ 3 కృతజ్ఞతలు తెలిపారు.