అంకురా ఆస్పత్రిలో ఫైర్: ఘటనస్థలంలో మీడియాపై బిల్డింగ్ ఓనర్ దాడి

అంకురా ఆస్పత్రిలో ఫైర్: ఘటనస్థలంలో మీడియాపై బిల్డింగ్  ఓనర్ దాడి

హైదరాబాద్ సిటీలోని గుడి మల్కాపూర్ లో ఉన్న అంకురా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.2023 డిసెంబర్ 23న సాయంత్రం 5 గంటల సమయంలో ఐదు అంతస్తుల ఆస్పత్రి భవనంలోని టెర్రస్ పై మంటలు చెలరేగాయి. టపాసులు పేలినట్లు టెర్రస్ పై మంటలు ఎగిసిపడ్డాయి. అదుపు చేసేందుకు ఆలస్యం కావటంతో ఆస్పత్రి మొత్తం మంటలు వ్యాపించాయి.

స్థానికుల సాయంతో ఆస్పత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో చుట్టు పక్కల భవనాల్లోని వారు సైతం ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది డీఆర్ ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు.

ఈక్రమంలో ఘటనపై కవరేజ్ కు వెళ్లిన మీడియా సిబ్బందిపై ఆస్పత్రి ని నిర్వహిస్తున్న బిల్డింగ్ ఓనర్ కింగ్ కోహినూర్ బిల్డర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బిల్డంగ్ కు ఎటువంటి పర్మిషన్ లేకుండా నిర్మించారని పలువురు ఆరోపిస్తున్నారు. కింగ్ కోహినూర్ ఓనర్ ఇంటిపై ఇప్పటికే పలుమార్లు ఐటీ సోదాలు జరిగాయి. ఇండియాలోనే మొట్టమొదటి స్పోర్ట్స్  బైక్ కొనుగోలు చేసిన కింగ్స్ కోహినూర్ డైరెక్టర్ కొడుకు నసీర్ ఖాన్ మీడియాపై దాడి చేశాడు. సెల్ ఫోన్లు లాక్కున్నారు. 

అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు.. ఎవరైనా గాయపడ్డారా.. చనిపోయారా అనే విషయాలు అధికారికంగా ప్రకటించలేదు.