K-RAMP Twitter Review: ‘కె-ర్యాంప్‌‌‌‌’ ట్విట్టర్ (X) రివ్యూ.. కిరణ్‌ అబ్బవరంకి మరో హిట్‌ పడినట్టేనా? టాక్‌ ఎలా ఉందంటే?

K-RAMP Twitter Review: ‘కె-ర్యాంప్‌‌‌‌’ ట్విట్టర్ (X) రివ్యూ.. కిరణ్‌ అబ్బవరంకి మరో హిట్‌ పడినట్టేనా? టాక్‌ ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన మూవీ ‘కె -ర్యాంప్‌‌‌‌’(K-RAMP). యూత్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కింది. డైరెక్టర్ జైన్స్ నాని తెరకెక్కించిన ఈ మూవీని రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు. దీపావళి కానుకగా ఇవాళ శనివారం (అక్టోబర్ 18న) సినిమా విడుదలైంది. టీజర్, ట్రైలర్, ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు తీసుకొచ్చాడు కిరణ్.

ఈ క్రమంలో మూవీపై యూత్లో మంచి క్యూరియాసిటీ కలిగేలా చేశాడు. అందుకు తగ్గట్టుగానే.. ‘‘పరీక్ష రాసేశాను.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను.. ఎందుకంటే, మనం కొన్ని పాత్రలు చేసినప్పుడు మనతో చాలా రోజులు అలా ఉండిపోతాయి.. కుమార్ అబ్బవరం కూడా అలాంటి పాత్రే. మీకు ఈ పండక్కి థియేటర్స్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఐతే ఇస్తున్నాను అనే నమ్మకం అయితే నాకు ఉంది. కె -ర్యాంప్‌‌‌‌ ను ఆస్వాదించండి’’ అని చెబుతూ వస్తున్నాడు. మరి గతేడాది దీపావళికి ‘క‌‌‌’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. ఈ దీపావళికి ర్యాంప్ని కొనసాగించాడా? లేదా అనేది ప్రీమియర్స్ టాక్ ద్వారా తెలుసుకుందాం. 

‘కె -ర్యాంప్‌‌‌‌’ కథని రివీల్ చేయకుండా.. సినిమా నడిచిన విధానాన్ని ప్రీమియర్ ఆడియన్స్ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో కిరణ్ పీటీఎస్డీ (Post Traumatic Stress Disorder) కలిగి ఉంటాడట. డైరెక్టర్ నాని.. తన ఫస్ట్ మూవీతోనే ఓ సీరియస్ ఇస్స్యూతో కథ డీల్ చేశాడని, అందుకు తనదైన కామెడీ జోడించినట్లుగా టాక్.

అయితే, ఫస్టాఫ్ యావరేజ్గా ఉందని, సెకండాఫ్ మాత్రం బాగా వర్కవుట్ అయిందని ఆడియన్స్ తమ రివ్యూస్ షేర్ చేస్తున్నారు. కిరణ్ నుంచి అదిరిపోయే కామెడీ పోర్షన్స్ వర్కవుట్ అయ్యాయట. హాస్పిటల్ ఎపిసోడ్.. సినిమాలో అదిరిపోయిందట.. రీసెంట్ టైమ్స్లో వచ్చిన కామెడీ ఎపిసోడ్లో ఇదే బెస్ట్ పోర్షన్ అని అంటున్నారు. సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్ పాత్రలు, కిరణ్ల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్కు క్రేజీ ఫీలింగ్ అందిస్తుందట.

అయితే, టీజర్, ట్రైలర్లో ఉన్నట్లుగా.. సినిమాలోనూ డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువ అయిందని.. అవి తగ్గించి ఉంటే.. బెటర్ అన్నట్లుగా నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఏదేమైనా: ఫస్ట్ డే పడే షోలకి.. యూత్ నుంచి పాజిటివ్ టాక్ వస్తే.. కిరణ్ పరీక్షలో పాసై పోయినట్లే!! అని ఓవరాల్ రివ్యూస్ ఇస్తున్నారు. 

ప్రీమియర్ మూవీ చూసిన ఆడియన్ తన రివ్యూ షేర్ చేశారు.  ‘‘ కిరణ్ అబ్బవరం ఎంట్రీ అదిరిపోయింది. కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కిరణ్ ర్యాంపేజ్, వెన్నెల కిశోర్, నరేష్, మురళీధర్ గౌడ్ల పాత్రల మధ్య టైమింగ్ బాగుంది.

ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఫన్ ఫన్ ఫన్ ఫన్ ఫన్. క్రేజీగా నవ్వుకుంటారు. హాస్పిటల్ ఎపిసోడ్, వెన్నెల కిషోర్ ఎపిసోడ్ ... ఫుల్ ర్యాంప్. కిరణ్ అబ్బవరం - సాయి కుమార్, హిట్ ఫార్ములా (తండ్రి కొడుకుల సెంటిమెంట్) సినిమాకు మరోసారి వర్కౌట్ అయింది. హిట్ కోటేశావ్ అన్నా..’’ అని తెలిపారు. 

‘ఓవరాల్‌గా కె -ర్యాంప్‌ మూవీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. సెకండాఫ్‌ పబ్‌ సీన్‌ సూపర్బ్. గతేడాది 'క' మూవీతో హిట్ కొట్టిన కిరణ్.. ఈ దీపావళితో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు’ అంటూ మరో నెటిజన్‌ రివ్యూ ఇచ్చాడు.‘‘కె -ర్యాంప్‌‌‌‌.. నార్మల్ స్టోరీ. మనం ఇంతకు ముందు లెక్కలేనన్ని సార్లు ఇలాంటి కథలు చూసాం. మెయిన్గా రొటీన్ స్క్రీన్‌ప్లేతో వచ్చింది. పూర్తిగా కామెడీని ఎంచుకుని.. యూత్ని అలరించే ప్రయత్నం చేశారు. అయితే క్రింజ్‌గానే అనిపిస్తుంది.

కొన్ని కామెడీ సీన్లను దర్శకుడు బాగా డీల్‌ చేశాడు. కానీ, మిగతా పోర్షన్లో రచన పేలవంగా ఉంది. కిరణ్ అబ్బవరం తన ప్రీవియస్ మూవీస్ మాదిరిగానే ఎప్పటిలాగే నటించాడు. మరి కొత్తదనం కనిపించదు. ఓవరాల్గా.. కె -ర్యాంప్‌‌‌‌ కొన్ని కామెడీ పోర్షన్స్ తప్ప, కంప్లీట్ ఎంటర్ టైన్ చేయదని’’  మరో నెటిజన్ తన రివ్యూలో రాసుకొచ్చాడు.