K Ramp Trailer Review: కళ్లు మింగాయా అవి కన్నీళ్లే.. ట్రైలర్ తోనే గట్టిగా ఇచ్చేసిన కిరణ్.. దీపావళి బ్లాస్టే

K Ramp Trailer Review: కళ్లు మింగాయా అవి కన్నీళ్లే.. ట్రైలర్ తోనే గట్టిగా ఇచ్చేసిన కిరణ్.. దీపావళి బ్లాస్టే

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్‌‌‌‌ నాని దర్శకత్వంలో రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించిన చిత్రం ‘కే ర్యాంప్‌‌‌‌’. ఈ నెల 18న సినిమా రిలీజ్. శనివారం (అక్టోబర్ 11న) ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. యూత్కి సరిపడా నవ్వులు, కిరాక్ డైలాగ్స్, రొమాన్స్, అంకుల్స్ ఆకతాయితనం.. ఇలా ట్రైలర్ మొత్తం గట్టిగా వాయించేలా ఉంది. ఇక ట్రైలర్ చివర్లో కళ్లు మింగాయా అవి కన్నీళ్లే.. అనే చెప్పే డైలాగ్ క్రేజీగా ఉంది.

ఈ దీపావళికి కిరణ్ ఖాతాలో గట్టి హిట్ పడ్డట్లే అని ట్రైలర్ చెప్పేస్తుంది. ఏదేమైనా.. ఫస్ట్ టీజర్ ద్వారా, బూతు పురాణాలను చూపించి విమర్శలు అందుకున్న టీమ్.. ట్రైలర్ లో మాత్రం కేర్ తీసుకుని, ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌లో హీరో కిరణ్‌‌‌‌ అబ్బవరం మాట్లాడుతూ ‘కొత్త స్క్రిప్ట్‌‌‌‌ చేద్దామని ‘క’లో నటించా. కానీ ఇది నా అభిమానుల కోసం చేసిన సినిమా. ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అతనే. ఇందులో నా పాత్ర ఈతరం యూత్‌‌‌‌కు దగ్గరగా ఉంటుంది. నాకు కూడా ఇలాంటి ఈజ్‌‌‌‌తో ఉన్న పాత్రలు ఇష్టం. ఫ్రస్ట్రేషన్‌‌‌‌లో యూత్‌‌‌‌ ఎలా మాట్లాడతారో అలాగే ఇందులో డైలాగ్స్‌‌‌‌ ఉంటాయి. సినిమా చూసేవాళ్లకు వాటితో ఇబ్బంది ఉండదని మాత్రం చెప్పగలను. ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది’ అని చెప్పాడు.

నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ ‘దీపావళి పండక్కి మీరు కొనే టపాసు రెండు నిమిషాలే ఉంటుంది. కానీ మీరు కొనే టిక్కెట్టుతో మా సినిమా రెండు గంటలు ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్ ఇస్తుంది. ఈ దీపావళికి ‘కె ర్యాంప్’ థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం” అన్నారు 

ట్రైలర్‌‌‌‌‌‌‌‌లోని ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతోందని, కిరణ్‌‌‌‌ నటనను, యుక్తి క్యారెక్టరైజేషన్‌‌‌‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని దర్శకుడు జైన్స్‌‌‌‌ నాని చెప్పాడు.

దీపావళికి వస్తున్న నాలుగు సినిమాలు హిట్ కావాలి. అందులో మన తెలుగు హీరో కిరణ్ నటించిన చిత్రం కనుక ‘కే ర్యాంప్’ ఒక మెట్టు పైన ఉండాలి’ అని నిర్మాత రాజేష్ దండ అన్నారు. డీవోపీ సతీష్ రెడ్డి, డైలాగ్ రైటర్ రవి తదితరులు పాల్గొన్నారు.