
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్. సుజీత్, సందీప్ కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ మంగళవారంతో పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. ఎన్నో అందమైన లొకేషన్స్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్‌తో అనుకున్న టైమ్‌కు సినిమా పూర్తి చేయగలిగాం అని దర్శక నిర్మాతలు చెప్పారు.
సినిమా అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నామన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. సామ్ సీ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.