ఓటిటిలో "మీటర్" ఎప్పుడంటే?

ఓటిటిలో "మీటర్" ఎప్పుడంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న కుర్ర హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు కిరణ్ అబ్బవరం. రిజల్ట్ ఏదైనా.. ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికె వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ప్రేక్షకులముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.

గీత ఆర్ట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించినా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా తరువాత కిరణ్ అబ్బవరం చేసిన మాస్ మసాలా సినిమా మీటర్. రమేష్ కాడూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అందుకె ఈ సినిమాని వీలైనంత త్వరగా OTT రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకోగా..  మే 5నుంచి ఈ సినిమాని స్ట్రీమింగ్‌ చేయనున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాను క్లాప్‌ ఎంటర్‌టైనమెంట్స్ సంస్థ నిర్మించగా.. సాయి కార్తిక్‌ సంగీతం అందించాడు.