కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ సంచలనం

కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ సంచలనం

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌.. థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో సంచలనం సృష్టిస్తే.. స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌ 21–18, 22–20తో మూడోసీడ్‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌ 9వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ షీ యు క్వి (చైనా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ 21–23, 21–15, 21–15తో వాంగ్‌‌‌‌‌‌‌‌ జు వీ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ)పై గెలవగా, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ 8–21, 21–16, 14–21తో వెంగ్‌‌‌‌‌‌‌‌ హాంగ్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ (చైనా)  చేతిలో, సాయి ప్రణీత్‌‌‌‌‌‌‌‌ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) చేతిలో, సమీర్‌‌‌‌‌‌‌‌ వర్మ 15–21, 15–21తో మాగ్నస్‌‌‌‌‌‌‌‌ జొనాసెన్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌) చేతిలో, ప్రియాన్షు రజావత్‌‌‌‌‌‌‌‌ 19–21, 10–21తో ఎంగ్‌‌‌‌‌‌‌‌ జి యాంగ్‌‌‌‌‌‌‌‌ (మలేసియా) చేతిలో, మిథున్‌‌‌‌‌‌‌‌ మంజునాథ్‌‌‌‌‌‌‌‌ 21–17, 8–21, 15–21తో కున్లావత్‌‌‌‌‌‌‌‌ వితిదసరన్‌‌‌‌‌‌‌‌ (థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడారు.

మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌-చిరాగ్‌‌‌‌‌‌‌‌ షెట్టి 21–13,18–-21, 21–17తో రాస్‌‌‌‌‌‌‌‌ముస్‌‌‌‌‌‌‌‌–ఫ్రెడెరిక్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో సింధు 8–21, 21–18, 18–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో పోరాడి ఓడింది. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అష్మితా చాలిహా 21–17, 21–14తో మాల్వికా బన్సోద్‌‌‌‌‌‌‌‌ (ఇండియా)పై, సైనా నెహ్వాల్‌‌‌‌‌‌‌‌  21–13, 21–7తో వెన్‌‌‌‌‌‌‌‌ యు జాంగ్‌‌‌‌‌‌‌‌ (కెనడా)పై గెలిచారు. డబుల్స్‌‌‌‌‌‌‌‌లో అశ్విని భట్‌‌‌‌‌‌‌‌–శిఖా గౌతమ్‌‌‌‌‌‌‌‌ 11–26, 6–21తో బీక్‌‌‌‌‌‌‌‌ హ నా–లీ సో హీ (కొరియా) చేతిలో ఓడారు.