50 లక్షల కిరాణ షాపులు ఆన్ లైన్ లో

50 లక్షల కిరాణ షాపులు ఆన్ లైన్ లో

మన దేశంలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌‌ ఆన్‌ లైన్‌ రిటైలింగ్‌ లో కి దూసుకొస్తోంది.ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 15 వేల డిజిటలైజ్డ్ రిటైల్‌ స్టోర్లను 2023 నాటికి 50 లక్షలకు పెంచనుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, మెరిల్‌లించ్‌ స్టడీ వెల్లడించింది. ఇండియా రిటైల్‌ మార్కెట్ విలువ 700 బిలియన్‌ డాలర్లు కాగా, ఇందులో 90 శాతం మార్కెట్ అసంఘటితరంగంలో నే ఉంది. వీటిలో వీధుల్లో ఉండేకిరాణ షాపులే ఎక్కువ. తమ దుకాణాలను ఆన్‌ లైన్‌ లోకి తీసుకురావడానికి ఈ షాపులన్నీఆసక్తిగా ఉన్నాయని స్టడీ పేర్కొంది.

ఫ్లిప్‌ కార్ట్‌‌,అమెజాన్‌ వంటి ఆన్‌ లైన్ సంస్థలు కూడా ఆన్‌ లైన్‌ లో కిరాణ సామగ్రి అమ్ముతుండటం, ఇతరదుకాణాల నుంచి పోటీ పెరుగుతుండటం వల్లచిన్న కిరాణా దుకాణాలు కూడా డిజిటైజేషన్‌ పైఆసక్తి చూపిస్తున్నాయి . ఇందెఒపం కిరాణాదుకాణాల్లో జియో ఎంపీఓఎస్‌‌ (మొబైల్‌పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ ) బిగించనుంది. ఇది 4జీ వేగంతో పనిచేస్తుంది కాబట్టి యజమాని స్థానికసరఫరాదారుల మధ్య నిరంతరాయ కనెక్టివిటీఉంటుంది. జియో ఎంపీఓఎస్‌‌ ద్వారానే తమకస్టమర్ల నుంచి ఆర్డర్లు పొందవచ్చు.

రూ.మూడు వేలకే..
ఇప్పటికే స్నాప్‌ బిజ్‌ , నుక్కడ్‌ షాప్స్‌ , గోఫ్రూగల్‌వంటి కంపెనీలు కొన్ని దుకాణాల్లో ఎంపీఓఎస్‌‌లను అమర్చాయి . జియోఎంపీఓఎస్‌‌ కోసందుకాణ యజమాని రూ.మూడువేలు చెల్లించాలి. ఇదే మెషీన్‌ కు స్నాప్‌ బిజ్‌ రూ.50 వేలువసూలు చేస్తోంది. నుక్కడ్‌ షాప్స్‌ ఎంపీఓఎస్‌‌కు అయితే రూ.30 వేల నుంచి రూ.55 వేలవరకు కట్టాలి. గోఫ్రూగల్‌ పీఓఎస్ సాఫ్ట్‌‌వర్‌ కురూ.15 వేల నుంచి రూ.లక్ష వసూలు చేస్తోంది.ఏ రకం చార్జిపైనా జియో ఎంపీఓఎస్‌‌కుమర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌ ) ఉండదు. యజమానులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. సరుకులకు డెలివరీ, వాణిజ్య ప్రకటనల వంటి సేవలు అందిస్తుంది.

‘‘రిలయన్స్‌ ఈరంగంలో కి అడుగుపెడితే కిరాణా దుకాణాలడిజిటైజేషన్‌ పెరుగుతుంది. ఎంపీఓఎస్‌‌లధరలు తగ్గడమే ఇందుకు కారణం. దుకాణాలసంఖ్య తగ్గేందుకూ అవకాశాలు ఉన్నాయి ’’ అనిఈ స్టడీ వివరించింది. బెంగళూరు కేంద్రంగాపనిచేసే స్నాప్‌ బిజ్‌ దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో 4,500లకుపైగా ఎంపీఓఎస్ పరికరాలనుబిగించామని తెలిపిం ది. ‘‘స్నాప్‌ బిజ్‌ మర్చంట్‌పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ ద్వారా దుకాణదారుడుసరుకుల నిల్వల వివరాలను ఆన్‌ లైన్‌ లో భద్రపర్చవచ్చు. జీఎస్టీకి అనుగుణంగా బిల్స్‌నుఇవ్వొచ్చు.

కొనుగోలుదారుల ఇష్టాయిష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్‌ లైన్‌ పేమెంట్లను స్వీకరించవచ్చు’’ అని బ్యాంక్‌ ఆఫ్‌అమెరికా నివేదిక వివరించింది. రూ.50 వేలుచెల్లించిన కిరాణా దుకాణ యజమానికి స్నాప్‌ బిగ్‌ పీఓఎస్‌‌ పరికరం, ప్రత్యేక సాఫ్ట్‌‌వేర్‌, వాణిజ్యప్రకటనలను ప్రదర్శించడానికి స్క్రీన్‌, కొనుగోలుదారులతో సంబంధాలు పెంచు కోవడానికియాప్‌ ను అందిస్తుంది. కస్టమర్లకు ప్రత్యేకకూపన్లు, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి స్నాప్‌ బిజ్‌ఇజ్రాయెల్‌ కు చెందిన స్టార్టప్‌ స్టాప్‌ డాట్‌ ఈఈతో కలిసి పనిచేస్తోంది.