
- కిసాన్ మోర్చా తెలంగాణ శాఖ డిమాండ్
ఖైరతాబాద్, వెలుగు : ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని సంయుక్త కిసాన్‌మోర్చా తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ టర్మరిక్ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్ టేబుల్‌సమావేశం జరిగింది. రైతు నేతలు లఖ్విందర్‌సింగ్ అవౌలాక్, నల్లమల వెంకటేశ్వరరావు, కె. నరసింహనాయుడు మాట్లాడుతూ.. నల్లచట్టాల రద్దు కోసం చేసిన ఉద్యమంతో వల్లే కేంద్రం వెనక్కు తగ్గిందని గుర్తుచేశారు.
ఆ సమయంలో రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పరిష్కరించలేదని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యమంలో మృతి చెందిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో రైతు నేతలు శాంతకుమార్, జగ్జీత్సింగ్దలేవాల్, కేవీ బిజ్జు, అభిమాన్ కోర్, సచిన్ మల్హోత్రా తదితరులు మాట్లాడారు.