భారత శక్తి కార్యక్రమాలు

భారత శక్తి కార్యక్రమాలు

ఉదయ్​ యోజన్​: ఉజ్వల్​ డిస్కం అస్యూరెన్స్​ యోజన్​ లేదా ఉదయ్​ అనే కార్యక్రమాన్ని 2015, నవంబర్​లో కేంద్ర శక్తి మంత్రిత్వశాఖ ప్రారంభించింది. దేశంలో ఎలక్ట్రిసిటీ సరఫరా కంపెనీలకు ఉదయ్​ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ నష్టాల్లో ఉన్న వాటిని తిరిగి లాభాల్లోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం కృషిచేస్తుంది. చవకైన, అందరికీ 24X7 పాటు అందుబాటులో విద్యుత్​ అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమం పనిచేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో డిస్కంలు లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 

కుసుం: దేశ వ్యవసాయంలో సౌరశక్తిని వినియోగించడానికి ప్రోత్సహించే కార్యక్రమమే కిసార్​ ఊర్జా ఏవ ఉద్ధాన్​ మహా అభియాన్​ లేదా కుసుం. ఈ కార్యక్రమం కింద రైతులకు సౌర నీటి పంపులను అందిస్తారు. ఈ కార్యక్రమం కింద 27.5 లక్షల సౌర పంపులను స్థాపించనున్నారు. ఫలితంగా 0.5 మెగావాట్ల నుంచి రెండు మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్​ ప్లాంట్ల స్థాపనకు ఈ కార్యక్రమం కృషి చేస్తుంది.

దీన్​దయాళ్​ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన: గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్​ సరఫరా లక్ష్యంతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సరికొత్త కార్యక్రమమే దీనదయాళ్​ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన. భారతదేశ రాజకీయ తత్వవేత్తగా పేరొందిన దీన్​ దయాళ్​ ఉపాధ్యాయ పేరును ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం పేరు పెట్టింది. ఇదివరకు అమలులో ఉన్న రాజీవ్​గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన స్థానంలో ఇది అమలవుతుంది. 

ప్రధాన మంత్రి సహజ బిజ్లి హర్​ ఘర్​ యోజన 

కార్యక్రమం: 2017, సెప్టెంబర్​ 25న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సరికొత్త విద్యుత్​ సరఫరా కార్యక్రమమే సౌభాగ్యం. ఈ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పేద కుటుంబాలకు అదే విధంగా పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్​ కనెక్షన్లను అందిస్తారు. దేశంలో ఆ కాలం నాటికి విద్యుత్​ సరఫరా లేని నాలుగు కోట్ల కుటుంబాలు ఉండేవి.