కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డికి చోటు

కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డికి చోటు

కేంద్ర కేబినెట్ లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం దక్కింది. రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు, సికింద్రాబాద్ లోక్ సభ సభ్యుడు కిషన్ రెడ్డికి చోటు దొరికింది.

ఈ మధ్యాహ్నం కిషన్ రెడ్డికి పార్టీ సుప్రీమ్ అమిత్ షా ఫోన్ చేశారు. కేంద్ర మంత్రిగా బెర్త్ కన్ ఫామ్ చేశారు.

సాయంత్రం ప్రధానిగా నరేంద్ర మోడీతో పాటు.. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. కిషన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ దక్కడంతో రాష్ట్ర బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.