2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: కిషన్ రెడ్డి

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: కిషన్ రెడ్డి

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. 2024,  జూన్ 10వ తేదీ సోమవారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  కేంద్రం అన్ని రాష్ట్రాలతో సమన్వయంగా పని చేస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు.

మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం కిసాన్ సమ్మాన్ నిధి పథకంపైనే పెట్టారన్నారు కిషన్ రెడ్డి. 20వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో  జమ చేశామన్నారు.  ఇండియా కూటమిలా కాకుండా తమ అలెయన్స్ కు ఒక ఎజెండాతో పాటు నాయకుడు ఉన్నారని చెప్పారు. వచ్చే ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్దికి అంకితభావంతో పనిచేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.