గంగాపురం కిషన్ రెడ్డి : ప్రొఫైల్ ఇదీ

గంగాపురం కిషన్ రెడ్డి : ప్రొఫైల్ ఇదీ

బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు గంగాపురం కిషన్ రెడ్డి. 1964, మే 15న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో పుట్టారు కిషన్ రెడ్డి.

విద్యార్థి దశలోనే RSS కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ABVPలో చురుకుగా వ్యవహరించారు. తర్వాత BJYMలో కీ రోల్ పోషించారు.2002లో BJYM జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన కిషన్ రెడ్డి.. మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు.

2004లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కిషన్ రెడ్డి. 2009, 2014లో అంబర్ పేట నుంచి గెలిచారు. BJLP నేతగా, రాష్ట్ర BJP అధ్యక్షునిగా పనిచేశారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయిన కిషన్ రెడ్డి… ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి MPగా ఘనవిజయం సాధించారు. మోడీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.