
ఢిల్లీ: పార్టీని ఎలా నడపాలనే విషయమై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకే ఢిల్లీ వచ్చానని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చెప్పారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై విలేకరులు ప్రస్తావించగా బీజేపీకి వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ ముఖ్యమని అన్నారు. ప్రతి పార్టీలోనూ గొడవలు ఉన్నాయ ని, వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుం టామని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ దాటితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కాంగ్రెస్ లో రేవంత్, రాజగోపాల్ రెడ్డి మధ్య, బీఆర్ఎస్ లో కవితకు పార్టీకి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పారు.
46 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు సీఎ రేవంత్ అపాయింట్ మెంట్ అడగగానే ఇస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీఎంకే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
42% రిజర్వేషన్లు అసాధ్యం
బీసీలకు 42% రిజర్వేషన్లు అసాధ్యమని, న్యాయపరమైన చిక్కులు తెలిసి బీసీలను మోసం చేస్తున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. బీసీలను తప్పుదోవ పట్టించేందుకే ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. తాము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని, కేంద్రంపై నిందలు వేస్తే ఊరు కోమని అన్నారు. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం కేంద్రం బాధ్యత అని అని అంటున్నారన్నారు. లీగల్ ఒపీనియన్ లేకుండా ఆర్డినెన్స్ తీసుకువచ్చారని అన్నారు. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే ప్రక్రియ ముఖ్యమంత్రి కి తెలుసా ? అని ప్రశ్నించారు. అవి కూడా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయన్నారు. 2006లో అయ్యర్ కోహ్లి కేసులో మరోసారి కేశవానంద భారతి కేసు మరోసారి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. న్యాయపరమైన చిక్కులు తెలిసీ బీసీలను మోసం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరగకుండా ఉండేందుకు జరిగే ఎత్తుగడే ఈ మోసమని ఆరోపించారు.