హరిహర వీరమల్లు మూవీకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

హరిహర వీరమల్లు మూవీకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సినిమా 2025, జూలై 24 ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇవ్వడంతో జూలై 23వ తేదీ రాత్రి థియేటర్లలో హరిహర వీరమల్లు బొమ్మ పడనుంది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది మూవీ యూనిట్. ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడమే కాకుండా హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

సినిమా విడుదలైన జూలై 24వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు అంటే పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు సర్కార్ ఒకే చెప్పింది. సింగిల్ స్ర్కీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‎ల్లో వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‎లో టికెట్ ధర గరిష్టంగా రూ.150.. మల్టీప్లెక్స్‎ల్లో హాయొస్ట్ రూ. 200 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పించింది. జూలై 24 నుంచి 27 వరకు సింగిల్ స్ర్కీన్లలో రూ.150, మల్టీప్లెక్స్‎ల్లో రూ.200 ధర పెంచి టికెట్లు విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది.  జూలై 28 నుంచి ఆగస్ట్ 2 వరకు సింగిల్ స్ర్కీన్లలో రూ.106, మల్టీప్లెక్స్‎ల్లో రూ.150 టికెట్ ధర పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ రేట్లకు జీఎస్‎టీ అదనమని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం.

ఏపీ ప్రభుత్వం కూడా హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యే ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు డిసైడ్ చేసింది సినిమా యూనిట్. ప్రీమియర్ షోలకు గాను ఒక్కో టికెట్ రూ. 600గా డిసైడ్ చేసింది సినిమా యూనిట్. దీనిపై జీఎస్టీ అదనం అని స్పష్టం చేసింది. అంతే కాకుండా సినిమా రిలీజైన రోజు నుండి పదిరోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు 10 రోజుల దాకా అన్ని థియేటర్లకు పెంచిన ధరలు వర్తిస్తాయని తెలిపింది ప్రభుత్వం.

లోయర్ క్లాస్ టికెట్లు రూ.100, అప్పర్ క్లాస్ టికెట్లు రూ. 150 వరకు, మల్టీప్లెక్స్ టికెట్లు రూ. 200 వరకు వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం ఏపీలో సింగిల్ స్క్రీన్ గరిష్ట టికెట్ ధర 230 నుంచి మల్టిప్లెక్స్‏కి 295 వరకు ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి. కాగా, పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‎గా నటించిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‎తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.