‘తొర్రూరు’ అభివృద్ధి బాధ్యత మాది : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

‘తొర్రూరు’ అభివృద్ధి బాధ్యత మాది : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

తొర్రూరు, వెలుగు : తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తమదని, ఓటు వేసే బాధ్యత మీదంటూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ వైస్ చైర్మన్ ఝాన్సీరెడ్డి ప్రచారం చేశారు. ఆదివారం మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 12వ వార్డు కాంగ్రెస్​ బలపర్చిన అభ్యర్థి కేతవత్​ శ్రేయ ఓమేశ్, 9వ వార్డు అభ్యర్థి పంజా కల్పన తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలనలో తొర్రూరు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.

తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పట్టణంలోని సీపీఐ అనుబంధ సంఘం మీటింగ్​లో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ తొర్రూరు పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్, సీపీఐ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులకు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.