నేను మంత్రి కావడం కేసీఆర్ కు ఇష్టం లేదేమో

నేను మంత్రి  కావడం కేసీఆర్ కు ఇష్టం లేదేమో

 

సీఎం అనాగరిక భాష మాట్లాడటం సిగ్గు చేటన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను చెప్పిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. అమరవీరుల స్థూపం దగ్గర మీడియా సమక్షంలో చర్చకు రావాలని కేసీఆర్ కు సవాల్ చేశారు. అయితే చర్చలో బూతులు  మాట్లాడకుండా నాగరిక భాష మాట్లాడలన్నారు. నిన్న కేసీఆర్ ను విమర్శించడం కోసం ప్రెస్ మీట్ పెట్టలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయినట్లు.. కేసీఆర్ అభదత్రాభావంతో ఉన్నారని అన్నారు.ఆకాశం ఊడిపడినట్లు...నేల బద్దలైనట్లు కేసీఆర్ గంటకుపై గా తిట్లపురాణం మాట్లాడారన్నారు. నేను మంత్రి  కావడం కేసీఆర్ కు ఇష్టం లేనట్లుందన్నారు. రైతు కుంటుంబంలో పుట్టిన తాను..తెలంగాణ పోరాటంలో పాల్గొన్నానని తెలిపారు.

టీఆర్ఎస్ నాయకులు ఢిల్లీకి వచ్చినా కేంద్ర మంత్రిగా ఉన్న తన సహకారం కావాలని ఏనాడు కోరలేదన్నారు మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తో మాట్లాడేందుకు ఇప్పటి వరకు తనకు అపాయింట్ మెంట్ దొరక లేదన్నారు. రండా అని కేసీఆర్ పరుష పదజాలంతో అన్నా బాధ పడలేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కు నేనంటే కోపమో,బాధో అర్ధం కావడం లేదన్నారు. కేసీఆర్ భయంతో ఉన్నారని అన్నారు. ఆయన విమర్శించడానికి మాటలు లేవా అని ప్రశ్నించారు. రండా అని మాట్లాడటం కేసీఆర్ విజ్ణతకే వదిలేశానన్న కిషన్ రెడ్డి తాను..కేసీఆర్ స్థాయికి దిగజారి  మాట్లాడలేను అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయినట్లు కేసీఆర్ మాట్లాడారన్నారు.


పార్టమెంట్ లో తెలంగా బిల్లుపాస్ కావడానికి ఎంతో ప్రయత్నిచడంతో పాటు..రాష్ట్రం ఏర్పాటు కోసం జాతీయ నాయకులతో మాట్లాడానని తెలిపారు కిషన్ రెడ్డి.