అప్లికేషన్ల పేరుతో కాంగ్రెస్ టైం పాస్ చేస్తోంది: కిషన్ రెడ్డి

అప్లికేషన్ల పేరుతో కాంగ్రెస్ టైం పాస్ చేస్తోంది: కిషన్ రెడ్డి

అప్లికేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్ పాస్ చేస్తోందని విమర్శించారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి. జనవరి 4వ తేదీ గురువారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న దరఖాస్తులో ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దరఖాస్తులతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం తెలుసు.. అయినా రేషన్ కార్డు అడుతున్నారని మండిపడ్డారు. తలెంగాణ ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టాలా?.. ఉద్యమకారులు అరెస్టై జైలుకు వెళ్లిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి.. మళ్లీ ఎఫ్ఐఆర్ కాపీలు అడగడమేంటని ప్రశ్నించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం కు చిత్త శుద్ధి ఉంటే.. ఎలాంటి దరఖాస్తులు లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు అమలు చేయాలని కిషన్ రెడ్డి అన్నారు.