- రంగారెడ్డి జిల్లా కి షన్నగర్ గ్రామస్తుల తీర్మానం
షాద్ నగర్, వెలుగు: ఊరిలో మద్యపాన నిషేధం అమలుచేస్తూ రంగారెడ్డి జిల్లా కిషన్నగర్గ్రామస్తులు తీర్మానం చేశారు. మద్యానికి బానిసలై చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తించిన గ్రామస్తుడు శేఖర్గత నెల 22న గ్రామంలోని బెల్టు షాపులను క్లోజ్చేయాలని నిరాహార దీక్షకు దిగాడు. మద్యం కారణంగా చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. శేఖర్ దీక్షకు ఊరిలోని మహిళలు, యువకులు మద్దతు పలికారు.
తాజాగా గ్రామస్తులంతా కలిసి గ్రామంలో మద్యాపాన నిషేధం అమలుచేయాలని తీర్మానించారు. మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా వేయడంతోపాటు అందరి సమక్షంలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తామని హెచ్చరించారు. అలాగే మద్యం కొన్నవారికి రూ.25వేలు జరిమానా, మద్యం అమ్మకం చేపట్టిన వ్యక్తిని పట్టిస్తే రూ.10 వేలు బహుమతిగా ఇస్తామని తెలిపారు.