
‘కిష్కింధపురి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి జెన్యూన్‌గా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నాడు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సినిమాకొస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఇది చాలా హ్యాపీ మూమెంట్. 1400 మందితో కలిసి సినిమా చూశాను. రెస్పాన్స్ మామూలుగా లేదు. ప్రీమియర్ షోల నుంచే మంచి ఆదరణ దక్కుతోంది. ఆర్గానిక్‌గా ఆడియెన్స్‌కి రీచ్ అయ్యింది.
చాలా జెన్యూన్‌గా ప్రేమను సంపాదించాం. ఈ ప్రేమ ఇంకా కొనసాగుతుంది. ఆడియెన్స్‌కు కొత్త జోనర్, ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని చేసిన మా ప్రయత్నం మంచి రేంజ్‌కు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి ‘ఓజీ’ వచ్చేంతవరకు మా సినిమా వెళుతూనే ఉంటుంది’ అని అన్నాడు. దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ ‘ఈ మూమెంట్‌ను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. సాహుగారు, సాయిగారి సపోర్ట్‌తోనే ఇది పాజిబుల్ అయింది.
ఈ మూమెంట్‌ని ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటా’ అని చెప్పాడు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ‘డిస్ట్రిబ్యూటర్స్, ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మేము అనుకున్న దానికంటే డబుల్ రెస్పాన్స్ వస్తోంది. మా బ్యానర్‌లో మంచి సినిమా పడింది. ఇది వెరీ ప్రౌడ్ మూమెంట్’ అని అన్నారు. ఆడియెన్స్ రెస్పాన్స్ తమకు గొప్ప బలాన్ని ఇచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ అన్నాడు.