తెలంగాణ నేటివిటీతో ‘కిసీ కా భాయ్‌‌ కిసీ కా జాన్’

తెలంగాణ నేటివిటీతో ‘కిసీ కా భాయ్‌‌ కిసీ కా జాన్’

సల్మాన్ ఖాన్ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్‌‌ కిసీ కా జాన్’. ఫర్హాద్‌‌ సమ్‌‌జీ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్‌‌. విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు, భాగ్యశ్రీ, భూమికా చావ్లా, మాళవికా శర్మ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తమిళ హిట్ మూవీ ‘వీరమ్‌‌’కి రీమేక్. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

ప్రేక్షకులు సల్మాన్ సినిమాల నుండి ఆశించే యాక్షన్, ఎమోషన్, లవ్, ఫ్యామిలీ లాంటి అన్ని ఎలిమెంట్స్‌‌ను జోడించి కమర్షియల్ ఎంటర్​టైనర్‌‌‌‌గా తీసినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. సల్మాన్ రెండు డిఫరెంట్ గెటప్స్‌‌లో కనిపిస్తున్నాడు. హిందీ రీమేక్‌‌ కోసం సల్మాన్‌‌ ఇమేజ్‌‌కు తగ్గట్గుగా చాలానే మార్పులు చేశారు. వెంకటేష్, పూజాహేగ్డే, భూమిక బతుకమ్మలతో కనిపించడాన్ని బట్టి.. ఇందులో తెలంగాణ నేటివిటీని చూపిస్తున్నట్టు అర్థమవుతోంది. సల్మాన్ కూడా తెల్ల లుంగీ కట్టి డ్యాన్స్ చేస్తున్నాడు. మొత్తానికి సౌత్‌‌ మార్కెట్‌‌పై ఫోకస్ పెట్టిన సల్మాన్ ఖాన్.. స్టోరీతో పాటు సౌత్ యాక్టర్స్, సౌత్ నేటివిటీ ఉన్న సినిమాతో వస్తున్నాడు. ఏప్రిల్ 21న సినిమా విడుదల కానుంది.