సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌‌‌‌లో కివీస్​ టార్గెట్‌‌‌‌ 267

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌‌‌‌లో కివీస్​ టార్గెట్‌‌‌‌ 267
  • ప్రస్తుతం 40/1
     

హామిల్టన్‌‌‌‌: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌ నిలకడగా ఆడుతోంది. సఫారీలు నిర్దేశించిన 267 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను ఛేదించేందుకు గురువారం మూడో రోజు బరిలోకి దిగిన కివీస్‌‌‌‌ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 13.5 ఓవర్లలో 40/1 స్కోరు చేసింది. టామ్‌‌‌‌ లాథమ్‌‌‌‌ (21 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉండగా, డేవన్‌‌‌‌ కాన్వే (17) ఫెయిలయ్యాడు.

అంతకుముందు డేవిడ్‌‌‌‌ బెడింగ్‌‌‌‌హమ్‌‌‌‌ (110) సెంచరీకి తోడు కీగన్‌‌‌‌ పీటర్సన్‌‌‌‌ (43), నీల్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌ (34) రాణించడంతో.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 69.5 ఓవర్లలో 235 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. 104 రన్స్‌‌‌‌కే 4 వికెట్లు కోల్పోయిన ప్రొటీస్‌‌‌‌ను బెడింగ్‌‌‌‌హమ్‌‌‌‌, పీటర్సన్‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌కు 98 రన్స్‌‌‌‌ జోడించి ఆదుకున్నారు.

ఇన్నింగ్స్‌‌‌‌ మొత్తంలో ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. కివీస్‌‌‌‌ బౌలర్లలో విలియమ్‌‌‌‌ ఓ రూర్కె 5, గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ 2 వికెట్లు తీశారు. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌ గెలవాలంటే ఇంకా 227 రన్స్‌‌‌‌ చేయాల్సి ఉంది.