రేసులోకి నైట్​ రైడర్స్.. చివరి బాల్ కు పంజాబ్పై గెలుపు

రేసులోకి నైట్​ రైడర్స్.. చివరి బాల్ కు పంజాబ్పై గెలుపు

కోల్‌‌కతా:  మరోసారి చివరి బాల్‌‌ వరకు  థ్రిల్లింగ్‌‌గా సాగిన ఛేజింగ్‌‌లో  కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ కమాల్‌‌ చేసింది. పంజాబ్‌‌ కింగ్స్‌‌పై ఉత్కంఠ విజయం సాధించి  ప్లే ఆఫ్స్‌‌ రేసులో ముందుకొచ్చింది. బౌలింగ్‌‌లో వరుణ్‌‌ చక్రవర్తి (3/26), బ్యాటింగ్‌‌లో నితీష్‌‌ రాణా (38 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 51), ఆండ్రీ రసెల్‌‌ (23 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42), రింకూ సింగ్ (10 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 21 నాటౌట్‌‌) చెలరేగడంతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో కేకేఆర్‌‌ 5 వికెట్లతో పంజాబ్‌‌ను ఓడించింది.

మొదట పంజాబ్‌‌ కింగ్స్‌‌ 20 ఓవర్లలో 179/7 స్కోరు చేసింది.  శిఖర్‌‌ ధవన్‌‌ (47 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 57) ఫిఫ్టీతో రాణించాడు. వరుణ్‌‌ మూడు, హర్షిత్‌‌ రాణా రెండు వికెట్లు తీశాడు. అనంతరం కేకేఆర్‌‌ 20 ఓవర్లలో 182/5 స్కోరు చేసి గెలిచింది. లీగ్‌‌లో ఐదో విక్టరీతో కేకేఆర్‌‌ 8 నుంచి  ఐదో ప్లేస్‌‌కు దూసుకొచ్చింది. రసెల్​కు ప్లేయర్ ఆఫ్‌‌ ద 
మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.

ధవన్‌‌ ఫిఫ్టీ

కెప్టెన్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ ఫిఫ్టీతో సత్తా చాటినా వరుసగా వికెట్లు తీసిన కేకేఆర్‌‌  బౌలర్లు.. పంజాబ్‌‌ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.   ఓపెనర్‌‌ ప్రభ్‌‌ సిమ్రన్‌‌ (12), భానుక రాజపక్స (0)ను హర్షిత్​ ఔట్​ చేయగా, లివింగ్‌‌స్టోన్‌‌ (15)ను స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తి పెవిలియన్‌‌ చేర్చాడు. ధవన్‌‌ జాగ్రత్తగా ఆడగా , జితేష్‌‌ శర్మ (21) రెండు సిక్సర్లతో జోరు పెంచే ప్రయత్నం చేశాడు. అయితే అద్భుతంగా బౌలింగ్‌‌ చేసిన చక్రవర్తి.. 13వ ఓవర్లో అతడిని పెవిలియన్‌‌ చేర్చగా.. నరైన్ బౌలింగ్‌‌లో సిక్స్‌‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ధవన్‌‌ను కెప్టెన్‌‌ నితీష్‌‌ ఔట్‌‌ చేయడంతో 120కి పంజాబ్‌‌ సగం వికెట్లు కోల్పోయింది. రిషి ధవన్‌‌ (19), సామ్‌‌ కరన్‌‌ (4) ఫెయిలైనా..  చివరి రెండు ఓవర్లలో షారుక్‌‌ ఖాన్‌‌ (8 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తోరాణా, రసెల్‌‌, రింకూ జో 21 నాటౌట్‌‌), హర్‌‌ప్రీత్‌‌ బ్రార్‌‌ (17 నాటౌట్‌‌) భారీ షాట్లతో చెలరేగి 35 రన్స్‌‌ రాబట్టారు. 

రాణా, రసెల్‌‌, రింకూ జోరు

కెప్టెన్‌‌ నితీష్‌‌ రాణా వేసిన పునాదిపై చివర్లో రసెల్‌‌, రింకూ మెరుపులతో కేకేఆర్‌‌ విజయం సొంతం చేసుకుంది. ఛేజింగ్‌‌లో ఆ టీమ్‌‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు జేసన్‌‌ రాయ్‌‌ (38), గుర్బాజ్‌‌ (15) తొలి వికెట్‌‌కు 38 రన్స్‌‌ జోడించారు. ఈ ఇద్దరినీ ఔట్​ చేసిన పంజాబ్ బౌలర్లు కట్టడి చేయడంతో సగం ఓవర్లకు కేకేఆర్‌‌ 76/2 మాత్రమే చేసింది. కానీ, లివింగ్‌‌ స్టోన్‌‌ వేసిన 11వ ఓవర్లో వరుసగా 4, 4, 6తో కెప్టెన్‌‌ రాణా చెలరేగిపోయాడు.అదే జోరుతో ఫిఫ్టీ దాటాడు. కానీ, తన వరుస ఓవర్లో వెంకటేశ్‌‌(11), రాణాను ఔట్‌‌ చేసిన రాహుల్‌‌ చహర్‌‌ (2/23)  కేకేఆర్‌‌ను దెబ్బకొట్టాడు.

ఎలిస్‌‌ వేసిన 17వ ఓవర్లో రసెల్‌‌ ఫోర్‌‌, రింకూ సిక్స్‌‌ సహా 15 రన్స్‌‌ రావడంతో హోమ్‌‌టీమ్‌‌పై ఒత్తిడి తగ్గింది. తర్వాతి ఓవర్లో 10 రన్సే వచ్చినా.. కరన్ వేసిన 19వ ఓవర్లో రసెల్ మూడు సిక్సర్లతో మ్యాచ్‌‌ను వన్‌‌సైడ్‌‌ చేసేశాడు. చివరి ఓవర్లో 6 రన్స్‌‌ అవసరం అవగా.. తొలి నాలుగు బాల్స్‌‌లో నాలుగే రన్స్ ఇచ్చిన అర్ష్‌‌దీప్‌‌ ఐదో బాల్‌‌కు రసెల్‌‌ను రనౌట్‌‌ చేసి టెన్షన్‌‌ రేపాడు. కానీ, లాస్ట్‌‌ బాల్‌‌కు ఫోర్‌‌ కొట్టి రింకూ సింగ్‌‌ కేకేఆర్‌‌ను గెలిపించాడు.  .