
న్యూఢిల్లీ: రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఎల్) అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో అమెరికన్ కంపెనీ కేకేఆర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయనుంది. తమ మధ్య రూ.11,367 కోట్ల ఒప్పందం జరిగిందని ఆర్‌ఐఎల్ సంస్థ శుక్రవారం ప్రకటించింది. దీంతో జియోలోని 2.32 శాతం కేకేఆర్‌కు బదిలీ చేయనున్నట్లు చెప్పింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్వీటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్ ఇప్పటికే పార్టనర్స్‌గా ఉండగా.. ఇప్పుడు కేకేఆర్ కూడా జియోలో చేరింది. దీంతో ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ.4.91 లోక్షల కోట్లకు చేరింది. జియోలో ఇప్పటి వరకు వివిధ కంపెనీల పెట్టుబడుల విలువ రూ.78,562 కోట్లకు చేరింది. “ ప్రపంచంలో ఆర్థికపరమైన సంస్థల్లో ఒకటైన కేకేఆర్ మాకు బిజినెస్ పార్టనర్ కావడం ఆనందంగా ఉంది. దేశ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరేలా భారత్‌ను డిజిటల్ దేశం మార్చేందుకు కేకేఆర్‌తో కలిసి పనిచేస్తాం” అని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు.