IPL 2024: ఐపీఎల్ ట్రోఫీ ఎవరిది..? మూడు జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న చెపాక్

IPL 2024: ఐపీఎల్ ట్రోఫీ ఎవరిది..? మూడు జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న చెపాక్

రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ మరో రెండు మ్యాచ్ లతో ముగియనుంది. టైటిల్ వేటలో 10 జట్లు పోరాడితే 7 జట్లు లీగ్ నుంచి నిష్క్రమించాయి. మిగిలిన మూడు జట్లు టైటిల్ రేస్ లో ఉన్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లలో ఒక జట్టు ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ అందుకోనుంది. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలోని కేకేఆర్ జట్టు క్వాలిఫయర్ 1 లో సన్ రైజర్స్ పై గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. మరోవైపు క్వాలిఫయర్ 1 లో ఓడిపోయిన సన్ రైజర్స్, ఎలిమినేటర్ లో గెలిచిన రాజస్థాన్ క్వాలిఫయర్ 2 లో అమీతుమీ తేల్చుకోనున్నారు.
 
టోర్నీ అంతటా నిలకడగా రాణించిన మూడు జట్లలో ఏ జట్టు టైటిల్ కొడుతుందో ఆసక్తికరంగా మారింది. మూడు జట్లు బలంగా ఉండడంతో ట్రోఫీ గెలిచే జట్టుపై క్రికెట్ ప్రేమికులు, ఎక్స్ పర్ట్స్ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అయితే మూడు జట్లను ఒక విషయంలో ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదేంటో కాదు చెన్నైలోని చెపాక్ మైదానం. ఐపీఎల్ లోని మిగిలిన రెండు మ్యాచ్ లు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం (మే 24) సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ తో ఢీ కొట్టనుంది. 

ఆదివారం (మే 26) ఐపీఎల్ ఫైనల్ వేదిక చెన్నై కానుంది. ఈ స్టేడియంలో మూడు జట్లు ఈ సీజన్ లో చెత్త రికార్డ్ కలిగి ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పై కేకేఆర్, రాజస్థాన్, సన్ రైజర్స్ సూపర్ కింగ్స్ జట్లు చిత్తుగా ఆడాయి. దీంతో ఈ పిచ్ ఎలా అనుకూలిస్తుందో ఒక అంచనాకు రాలేకపోతున్నాయి.ప్లే ఆఫ్స్ లో చెన్నై రాకపోవడం ఈ మూడు జట్లకు కలిసి వచ్చే అంశం. స్లో పిచ్ కావడంతో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మరి ఏ జట్టు చెపాక్ గ్రౌండ్ లో ఆధిపత్యం చూపించి ట్రోఫీ కొడుతుందో చూడాలి.